BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 03:58 pm
Posted by : K MAHESH

సంస్థాన్ నారాయణపురంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 03:58 PM
120 వీక్షణలు

పేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా | నారాయణపురం | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన నూతన లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ పత్రాలను మంగళవారం పంపిణీ చేశారు. గుడిమల్కాపురంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తానని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. చేయూత పింఛన్లు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన పేదలకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తాయని తెలిపారు.

పింఛన్ మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్‌చందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కోన్‌రెడ్డి నరసింహ, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు సురపల్లి వెంకటేష్, పందుల యాదగిరి గౌడ్, చేనేత సహకార సంఘం చైర్మన్ చిలుకూరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారగొని శంకర్ గౌడ్, మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, కాంగ్రెస్ గ్రామ శాఖ సహాయ కార్యదర్శి రేవనపల్లి గోపాల్, వడ్డేపల్లి శివప్రసాద్, వలిగొండ మహేష్, కారోబర్ పున్నం యాదగిరి, గ్రామపంచాయతీ సిబ్బంది, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.