BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 03:06 pm
Posted by : ANTHATI NARENDAR

ఉరుమడ్లలో నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
17 Nov, 2026 - 03:06 PM
88 వీక్షణలు

అర్హులందరికీ ప్రభుత్వ చేయూత అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా | చిట్యాల | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకంలో భాగంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నూతన లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ ఉత్తర్వులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్లు వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. పింఛన్ ద్వారా లబ్ధిదారులకు కొంత ఆర్థిక వెసులుబాటు లభించడంతో పాటు వారి కుటుంబాలకు కూడా అండగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పింఛన్ మంజూరు కావడంతో లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఆర్థికంగా తోడ్పాటు అందించే పింఛన్ ఉత్తర్వులు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, గ్రామ ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్ గౌడ్, వార్డు సభ్యులు పాకాల దినేష్, మేడబోయిన స్వాతి శ్రీను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగపురం వెంకటేశం, జన్నపాల రాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి ఏలేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, నూతన పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.