BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 02 February 2026, 08:26 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పీ హెచ్ సిల తనిఖీ

తెలంగాణ
02 Feb, 2026 - 08:26 AM
323 వీక్షణలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పీహెచ్సీల తనిఖీ చొప్పదండి, గుమ్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సందర్శన NTODAY NEWS: కరీంనగర్  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, పీఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియా, డీపీఓ ఎన్హెచ్ఎం స్వామి కలిసి చొప్పదండి మరియు గుమ్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్ రిజిస్టర్, ఎన్‌సీడీ రిజిస్టర్, ఫార్మసీ స్టోర్స్, పిల్లల వ్యాధి నిరోధక టీకాల నిల్వల కోసం ఉన్న ఐఎల్ఆర్ యూనిట్ మరియు దాని రోజువారీ ఉష్ణోగ్రత రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణీల ఎంసీపీ కార్డులను పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అవుట్ పేషెంట్లను పలకరించి వైద్య సేవలపై అభిప్రాయాలు సేకరించారు. సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని, గర్భిణీ చెకప్‌లు, అభా కార్డుల సృష్టి సంఖ్యను మెరుగుపరచాలని సూచించారు. 13 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపుల్లో స్క్రీనింగ్ చేసిన వారందరికి రీ-స్క్రీనింగ్ నిర్వహిస్తూ ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. ప్రసూతి గది పరిశుభ్రతను పరిశీలించి, అక్కడ అమలు చేయాల్సిన ప్రోటోకాల్ చార్టులను కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి, గుమ్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ కీర్తన, డాక్టర్ అరుణతో పాటు సంబంధిత వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Sd/- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కరీంనగర్ #HealthDepartment #PrimaryHealthCentre #PHCInspection #PublicHealth #MaternalHealth #GovernmentHospitals #Karimnagar #TelanganaHealth #PressNote #HealthServices Follow us on Website Facebook Instagram YouTube