BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 07 August 2026, 03:11 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎల్ నినో ప్రభావంతో రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Aug, 2026 - 03:11 PM
44 వీక్షణలు

ఎల్ నినో ప్రభావంతో రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తలు..

అన్నమయ్య జిల్లా.

చౌడేపల్లి

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం,పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు.

రైతులకు ముఖ్య సూచనలు

నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగు ప్రణాళిక రూపొందించాలి.వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన లేదా తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలి.డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించి నీటిని ఆదా చేయాలి.వరికి బదులు ఆరుతడి పంటలైన రాగి,సజ్జ,కొర్రలు,ఉలవలు ఇలాంటి పంటలు సాగు చేసుకోవాలి.పంటల్లో చీడపీడలు, వ్యాధులు కనిపించిన వెంటనే సమీప రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.ఈ కార్యక్రమంలో పుంగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శివకుమార్  పాల్గొన్నారు.