BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 July 2026, 11:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధం కావాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 11:09 AM
68 వీక్షణలు

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధం కావాలి

విస్సన్నపేటలో ఉద్యాన శాఖ అధికారుల అవగాహన సదస్సు – సబ్సిడీ పథకాలు వినియోగించుకోవాలని సూచన

విస్సన్నపేట: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని విస్సన్నపేట గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణతో పాటు ఆధునిక సాగు విధానాలను అనుసరిస్తే పంటలను నష్టాల నుంచి కాపాడుకోవచ్చని అధికారులు రైతులకు వివరించారు.

ఈ సందర్భంగా రైతులు తప్పనిసరిగా ఫైవ్ ప్రిన్సిపల్స్ అయిన ఫార్మ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు), మైక్రో ఇరిగేషన్ (డ్రిప్, స్ప్రింక్లర్), వీడ్ మ్యాట్స్, పీఎండీఎస్ (PMDS) వంటి నీటి సంరక్షణ, తేమ నిర్వహణ పద్ధతులను అమలు చేయాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును ఆదా చేస్తూ శాస్త్రీయ సాగు పద్ధతులను పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. వ్యవసాయ కుంటల నిర్మాణానికి ₹90,000 వరకు సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్‌కు సాగు విస్తీర్ణాన్ని బట్టి 50 శాతం నుంచి 100 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉందని వివరించారు. ఈ అవకాశాలను వినియోగించుకుని తోటలను, పంటలను వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉప ఉద్యాన సంచాలకులు పద్మావతి, ఎన్టీఆర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి. బాలాజీ కుమార్, ఉద్యాన శాఖ అధికారి బి. వాసవి సౌజన్య, గ్రామ ఉద్యాన సహాయకుడు సుబ్బారావు, స్థానిక రైతులు పాల్గొన్నారు.