BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 22 May 2026, 07:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 07:57 PM
378 వీక్షణలు

ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. చీపురుగూడెంలో మజ్జిగ పంపిణీ

ఏలూరు జిల్లా చీపురుగూడెం గ్రామంలోని తానికుంట చెరువులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొంటున్న కార్మికులకు కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండుతున్న ఎండల్లో పనిచేస్తున్న కార్మికుల దాహార్తిని తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చల్లని మజ్జిగ అందడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు, నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు కార్యనిర్వహణ కార్యదర్శి మందలపు జగదీష్, మాజీ సర్పంచ్ గంటసాల మన్మధరావు, చీపురుగూడెం తెలుగు దేశం గ్రామ పార్టీ ఉపాధ్యక్షురాలు అబ్బ దాసరి సరోజిని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్మికులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.