BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 06:41 pm
Posted by : K MAHESH

ఉపాధి హామీ కార్మికులకు రోజుకు రూ.600 కనీస వేతనం చెల్లించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 06:41 PM
19 వీక్షణలు

ఏడాదికి 200 రోజుల పని కల్పించాలి: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న

మహబూబాబాద్ జిల్లా | దంతాలపల్లి | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజుకు రూ.600 కనీస వేతనం చెల్లించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న డిమాండ్ చేశారు. మంగళవారం దంతాలపల్లి మండలం రేక్యతండా గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కార్మికులు తమకు రోజువారీ పనికి తక్కువ వేతనాలు అందుతున్నాయని, చేసిన పనికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని, కోరిన వారందరికీ పని కల్పించడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదవడంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గి ప్రజలు పొట్టచేత పట్టుకొని పట్టణాలకు వలస వెళ్తున్నారని లింగన్న పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ కార్మికులకు ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని, రోజుకు రూ.600 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాను కరువు ప్రాంతంగా గుర్తించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిధులు తగ్గిస్తూ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తోందని లింగన్న విమర్శించారు. వివిధ పేర్లతో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.1,000 చొప్పున చెల్లించాల్సిన మూడు సంవత్సరాల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సర్వం, బిఖు, బద్రు, రాములు, జగన్, బుజ్జి, యాకమ్మ, అచ్చమ్మ, జ్యోతి, సంధ్య, శైలమ్మ, సురేష్, వెంకన్న, సోమ్లా, మౌనిక, బద్రి తదితరులు పాల్గొన్నారు.