BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 28 March 2026, 06:25 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎర్రంపల్లి సొసైటీ జనరల్ బాడీ మీటింగ్‌కు భారీగా రైతుల హాజరు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Mar, 2026 - 06:25 AM
195 వీక్షణలు

ఎర్రంపల్లి సొసైటీ జనరల్ బాడీ మీటింగ్‌కు భారీగా రైతుల హాజరు

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం, చింతలపూడి మండలం ఎర్రంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సొసైటీ చైర్‌పర్సన్ తాళ్లూరి చంద్రశేఖర రెడ్డి అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.

ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జగ్గవరపు ముత్తా రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ జంగా చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరం యూరియా కొరత లేకుండా రైతులకు సమయానికి ఎరువులు అందించడంతో పాటు లోనింగ్ విధానాన్ని సక్రమంగా అమలు చేసినందుకు సొసైటీ పాలకవర్గాన్ని అభినందించారు.

ముత్తా రెడ్డి మాట్లాడుతూ, సొసైటీ ద్వారా రాజకీయాలకు అతీతంగా ధాన్యం కొనుగోలు జరగడం, ఆర్‌కే విధానంలో రైతుల ఖాతాల్లో 8 నుంచి 16 గంటలలోపే నగదు జమ కావడం రైతు ప్రభుత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే ఈ సీజన్‌లో మొక్కజొన్న కొనుగోళ్లను కూడా మార్కెట్ ద్వారా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సొసైటీ చైర్‌పర్సన్ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, తమ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే 127 మంది రైతులకు రూ.6,52,10,000 రుణాలు అందజేసినట్లు తెలిపారు. అలాగే యూరియా కొరత లేకుండా సరఫరా చేయడంతో పాటు, ఆర్‌కే ద్వారా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 16 గంటల్లోపే నగదు వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఇక ప్రగడవరం సొసైటీ కార్యాలయంలో క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేయడం, వచ్చే రబీ సీజన్‌కు ఎరువులు సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు సమయానికి రుణాలు చెల్లించి, కొత్త రైతులకు సహకరించి సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఈ సమావేశానికి ప్రగడవరం పంచాయతీతో పాటు పలు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చివరగా సొసైటీ సెక్రటరీ వెంకన్న రైతులకు ధన్యవాదాలు తెలిపారు.