BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 June 2026, 12:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చుట్టాల్ని నమ్మి రూ.21 లక్షలు అప్పిచ్చిన మహిళకు షాక్.. డబ్బులు అడిగితే న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 12:15 PM
131 వీక్షణలు

విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ బంధువులను నమ్మి రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చి తీవ్ర మోసానికి గురైంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఆమె వ్యక్తిగత వీడియోలను చూపించి న్యూడ్ కాల్స్ చేయాలని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు టైలరింగ్ పని చేస్తూ వచ్చిన ఆదాయాన్ని రొటేషన్ చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె బంధువులు చొక్కర అశోక్, వండ్రాసి శంకర్ తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కొంత డబ్బు అప్పుగా ఇవ్వాలని కోరారు. తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని నమ్మించడంతో 2018లో ఆమె రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చింది.

అయితే సంవత్సరాలు గడిచినా వారు డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితురాలు పలుమార్లు డబ్బులు ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో విజయవాడకు వచ్చి డబ్బు తీసుకెళ్లాలని చెప్పిన నిందితులు, అక్కడికి వెళ్లిన ఆమెకు వ్యక్తిగత వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.

అంతేకాకుండా ఆమె వాట్సాప్‌కు అసభ్యకర వీడియోలు పంపడంతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ చేసి, తాము చెప్పినట్లు చేయకపోతే వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు అశోక్, శంకర్రావును అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలిసినవారు, బంధువులే అయినా సరే పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపేటప్పుడు తగిన పత్రాలు, ఆధారాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.