BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 14 February 2026, 06:40 am
Posted by : NTODAY NEWS OFFICIAL

1.5 లక్షల మంది భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు

తెలంగాణ
14 Feb, 2026 - 06:40 AM
445 వీక్షణలు
శివరాత్రి రోజున 1.5 లక్షల మంది భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ రాజకుమారి NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు శ్రీశైలానికి తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను ఆమె పరిశీలించారు. శివరాత్రి రోజున సుమారు 20 గంటల పాటు దర్శన కార్యక్రమాలు కొనసాగనున్న నేపథ్యంలో భక్తులు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు తక్కువ సమయంలోనే దర్శనం పూర్తి చేసుకునేలా క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు, ప్రసాద పంపిణీ వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సుమారు 80 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రసాదాలు మరియు భోజన వసతి అందించగలిగినట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ఇదే విధంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టోల్ గేట్ రుసుము మినహాయింపు, రాత్రి వేళల్లో ప్రయాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. అటవీ మార్గం ద్వారా పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం 13 ప్రాంతాల్లో త్రాగునీరు, అన్నదానం, వైద్య సేవలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు 7 అంబులెన్సులు మరియు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అవసరమైతే స్ట్రెచర్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అటవీ ప్రాంతంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం పూర్తి చేసుకుని సురక్షితంగా స్వస్థలాలకు చేరుకోవాలని సూచించారు. #Srisailam #Mahashivaratri2026 #NandyalDistrict #TempleArrangements #DevoteesRush #FestivalManagement #AndhraPradesh #PublicAdministration Follow us on Website Facebook Instagram YouTube