BREAKING
thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం
Date of Publish : 03 October 2026, 02:22 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తహసీల్దార్ కార్యాలయంలోనే ప్రాణాలు తీసుకున్న రైతు

తెలంగాణ
/ మహబూబ్ నగర్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Oct, 2026 - 02:22 PM
11 వీక్షణలు

తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లా: కోయిలకొండ మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రైతు లవప్ప (53) శనివారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

కుటుంబానికి వంశపారంపర్యంగా 19 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 18 ఎకరాలు మాత్రమే తన ఆధీనంలో ఉన్నాయని, మరో ఎకరం పొరుగు రైతుల భూమిలో ఉందని లవప్ప అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ భూ వివాదం విషయంలో పొరుగు రైతులతో వివాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ మధ్యవర్తి చేతిని లవప్ప కొరకడంతో పోలీసులకు ఫిర్యాదు వెళ్లినట్లు సమాచారం.

భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురైన లవప్ప శనివారం తెల్లవారుజామున తహసీల్దార్ కార్యాలయ ప్రహరీ దూకి కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూ వివాదం, అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులు, ఇతర పరిస్థితులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.