BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 03:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Oct, 2026 - 03:51 PM
13 వీక్షణలు

ఖేత్ బచావో అభియాన్ రబీ–2026లో భాగంగా విస్సన్నపేట మండలంలో కార్యక్రమాలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: రైతులకు భూసార పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, పంటలలో చీడపీడల నివారణపై అవగాహన కల్పించేందుకు ఖేత్ బచావో అభియాన్ రబీ–2026 కార్యక్రమంలో భాగంగా డా. కె.ఎల్. రావు కృషి విజ్ఞాన కేంద్రం, గరికపాడు ఆధ్వర్యంలో విస్సన్నపేట మండలంలోని విస్సన్నపేట, తెల్లదేవరపల్లి, పుట్రేల గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు అందిస్తూ, పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించే అవకాశాలపై వివరించారు. జిల్లా వనరుల కేంద్రం డీడీఏ వెంకటేశ్వరరావు సమగ్ర ఎరువుల యాజమాన్యం, జీవ ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాల్సిన ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు. నేలలో ఉన్న పోషకాలను గుర్తించి, పంట అవసరాలకు అనుగుణంగా ఎరువులు వినియోగించడం ద్వారా సాగు ఖర్చులను నియంత్రించవచ్చని వివరించారు. డాక్టర్ ఎన్. రాజశేఖర్ మాట్లాడుతూ, ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. భూసార పరీక్షల ప్రాముఖ్యత, పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం, జీవ ఎరువులు, జీవ శిలీంధ్రనాశనుల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. భూసారాన్ని కాపాడుకుంటూ పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా దీర్ఘకాలంలో సాగును లాభదాయకంగా మార్చుకోవచ్చని సూచించారు. డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ, పత్తి పంటలో గులాబీ రంగు పురుగు, వరి పంటలో సుడి దోమ, అగ్గి తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పంటలను నిరంతరం పరిశీలిస్తూ చీడపీడలు, తెగుళ్ల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి, వ్యవసాయ శాఖ సూచనల మేరకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. డాక్టర్ కె. లక్ష్మీకళ మాట్లాడుతూ, మామిడి పంటలో కోతకు ముందు, కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు అందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిరప, వంగ, టమాటా వంటి ఉద్యాన పంటల్లో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ చర్యలతో పాటు సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతులను వివరించారు. పంటల్లో పురుగుల ఉధృతిని ముందుగానే గుర్తించేందుకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలను వినియోగించాలని, వీటి ద్వారా పురుగుల ఉనికిని గమనించి తగిన సమయంలో నివారణ చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విస్సన్నపేట వ్యవసాయ సహాయ సంచాలకులు కె. శశికళ, వ్యవసాయ అధికారి జి. రాజ్యలక్ష్మి, గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి పద్మజారాణి, ఏఈవో ఉషారాణి, ప్రకృతి వ్యవసాయ విభాగం ఇన్‌చార్జి శ్రీనివాసరావు, గ్రామీణ ఉద్యాన సహాయకులు, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.