BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 04:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Oct, 2026 - 04:04 PM
14 వీక్షణలు

పంటలు, ధాన్యం రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ సూచించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పంట నష్టాన్ని నివారించేందుకు రేపటి నుంచి నాలుగు రోజులపాటు పంట కోతలు చేపట్టవద్దని సూచించారు. ఇప్పటికే కోసిన ధాన్యం వర్షాలకు తడవకుండా టార్పాలిన్లతో పూర్తిగా కప్పి భద్రపరచాలని, వీలైనంత త్వరగా సురక్షితమైన గోదాములకు తరలించాలని తెలిపారు. పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలను శుభ్రం చేసుకోవాలని, నీరు సాఫీగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణం అనుకూలించే వరకు పురుగుమందులు, ఎరువుల పిచికారీలను వాయిదా వేసుకోవాలని స్పష్టం చేశారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటలు దెబ్బతినకుండా రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ కోరారు.