BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 04 April 2025, 06:40 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దు-జిల్లా కలెక్టర్

తెలంగాణ
04 Apr, 2025 - 06:40 AM
226 వీక్షణలు
పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దు-యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ఏప్రిల్ 04 గురువారం జిల్లాలో కురిసిన అకాల వర్షం,ఈదురు గాలులు,వడగళ్ల వానతో,నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం రోజున తుర్కపల్లి మండలంలోని తుర్కపల్లి మరియు దయ్యం బండ తండాలో నిన్న కురిసిన అకాల వర్షాలు,ఈదురు గాలులు,వడగళ్ల వానకు వరి చేనులు,మామిడి తోటలు కాయగూరల పంటలు,మిర్చి వంటి కొన్ని రకాల పంటలు వేసినందున్న చేతికి వచ్చిన పంటలు రైతులు నష్టపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని ఎకరాల పంటలు నష్టపోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.నష్టపోయిన పంట పొలాలు, తోటలను రైతులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి పంటలు అకాల వర్షాల వల్ల రైతులు ఎన్నో ఎకరాలు నష్టపోయారని దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాలలో , క్షేత్రస్థాయిలో పంటలను,తోటలను పరిశీలిస్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం నష్ట పోయిన ప్రతి రైతు యొక్క వివరాలు నమోదు చేసుకొని ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ రైతులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దేశ్యనాయక్ , హార్టికల్చర్ అధికారి సుభాషిణి,యంపిడిఓ,సంబందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube