BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 08 March 2026, 08:38 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

పెళ్లికి పదో తరగతి మిత్రుల ఆర్థిక సాయం

తెలంగాణ
08 Mar, 2026 - 08:38 PM
300 వీక్షణలు
స్నేహితురాలి పెళ్లికి పదో తరగతి మిత్రుల ఆర్థిక సాయం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ కష్టాల్లో ఉన్న స్నేహితురాలికి అండగా నిలుస్తూ పదో తరగతి పాత మిత్రులు ఆదర్శం చూపించారు. పేదరికం ఆమె వివాహానికి అడ్డంకి కాకూడదని భావించి తమ వంతు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన పుట్టపాక రజిత నిరుపేద కుటుంబానికి చెందిన యువతి. తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రజితకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న వెల్గటూర్ మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో చదివిన ఆమె పదో తరగతి (2005–2006 బ్యాచ్) మిత్రులు స్పందించారు. వార్డు సభ్యుడు నక్క సురేష్ ఆధ్వర్యంలో ఆ బ్యాచ్‌కు చెందిన మిత్రులు కలిసి రూ.16,000 నగదును సేకరించారు. ఆదివారం జరిగిన వివాహ వేదిక వద్దకు వెళ్లి ఆ మొత్తాన్ని రజితకు అందజేసి తమ స్నేహాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నక్క సురేష్ మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో కలిసి ఉన్న స్నేహితురాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని తమ వంతుగా ఈ సహాయం చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూగల సంతోష్, అరెల్లి స్వామి, వేముల పరమేష్, మెరుగు నరేష్, పోతు నాగరాజు, బోరె చందు, శిరీష, సరిత, కవిత, లలిత, భాగ్యలక్ష్మి, సుమలత, మమత తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరూ కలిసి చేసిన ఈ సేవను స్థానికులు అభినందించారు. #Velgatoor #Jagtial #Friendship #HelpingHands #TelanganaNews #SocialService #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube