BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 11:36 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హెడ్ పోస్టాఫీస్ జంక్షన్‌ నుంచి సీకేఎం ఆసుపత్రి మార్గంలో వరద నీరు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
13 Sep, 2026 - 11:36 PM
14 వీక్షణలు

వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి.. ఆసుపత్రికి వెళ్లే గర్భిణులకు ఇబ్బందులు

వరంగల్ | Ntoday News

వరంగల్ హెడ్ పోస్టాఫీస్ జంక్షన్ నుంచి సీకేఎం ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై మరోసారి వరద నీరు చేరింది. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలతో రహదారి మొత్తం జలమయమై వాగును తలపిస్తోంది.

ఇటీవల కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు సాఫీగా వెళ్లక రెండు రోజుల పాటు రోడ్డుపైనే నిలిచింది. తాజాగా వర్షపు నీరు కూడా కాలువల్లోకి వెళ్లే మార్గం లేక రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా సీకేఎం ఆసుపత్రికి వెళ్లే గర్భిణులు, రోగులు, వారి సహాయకులు ఈ పరిస్థితితో అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ఆసుపత్రికి చేరుకోవడం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షపు నీరు, మురుగునీరు రోడ్డుపై నిలవకుండా కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.