CJP నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె యశస్వినీ రాజే అరెస్ట్
ఢిల్లీలో నిరసన సందర్భంగా పోలీసుల అదుపులోకి.. గతంలో నీట్ పేపర్ లీకేజీ ఆందోళనలోనూ పాల్గొన్న యశస్వినీ
న్యూఢిల్లీ: CJP నిరసనల నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె యశస్వినీ రాజేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ పార్క్ వద్ద కూర్చున్న తనను పోలీసులు అదుపులోకి తీసుకొని కేశవ్‌పురం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు యశస్వినీ రాజే తన ఎక్స్ (X) ఖాతాలో ఫొటోను పోస్ట్ చేశారు.
విద్యార్థుల ఉద్యమాలకు యశస్వినీ రాజే గతం నుంచే మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. విద్యార్థుల సమస్యలపై నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ వస్తున్నారు. గతంలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి నిర్వహించిన ఆందోళనల్లోనూ ఆమె పాల్గొన్నారు.
తాజాగా ఢిల్లీలో జరిగిన CJP నిరసన సందర్భంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆమె చేసిన సోషల్ మీడియా పోస్టుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.