BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:52 am
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తిలో రూ.1.02 కోట్లతో వ్యవసాయ మార్కెట్ యార్డుకు శంకుస్థాపన

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
17 Nov, 2026 - 10:52 AM
28 వీక్షణలు

రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

హనుమకొండ జిల్లా | ఎల్కతుర్తి | ఎన్ టుడే న్యూస్

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి రూ.1.02 కోట్ల నిధులతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండల రైతాంగానికి, మార్కెట్ యార్డు పాలకవర్గానికి, ప్రజాప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్కతుర్తి మండలంలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ మార్కెట్ యార్డును రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడేలా నిర్మిస్తామని తెలిపారు. రైతులు తాము పండించిన పంటలను నేరుగా మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి విక్రయించుకునేందుకు అనువుగా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా మార్కెట్ యార్డులో మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

మార్కెట్ యార్డు పరిసరాల్లో కోతుల బెడద ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సమస్య పరిష్కారానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కోరినట్లు తెలిపారు. ఈ అంశంపై సంబంధిత మంత్రితో చర్చించి సోలార్ ఫెన్సింగ్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా వ్యవసాయ మార్కెట్ యార్డులకు శంకుస్థాపనలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

రైతులు తమ పంటలను దళారులకు తక్కువ ధరలకు విక్రయించి నష్టపోవద్దని మంత్రి సూచించారు. పంటలకు సరైన ధర లభించేలా మార్కెట్ సౌకర్యాలను వినియోగించుకోవాలని, తొందరపడి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.