BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఏప్రిల్ నుంచి ఉచితంగా ఐదు లక్షల బీమా

తెలంగాణ
31 Mar, 2025 - 04:05 AM
139 వీక్షణలు
భారత ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల పథకం 70 ఏళ్ళు దాటిన వృద్ధుల కూడా వర్తించనుంది. ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.ఆయుష్మాన్ భారత్ వయో వందనస్కీం అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా అందించనుంది. ఇందులో ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు, మెడిసిన్ అందించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు 416 నెట్వర్క్ ఆసుపత్రిలకు తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చారు .కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఎన్నో ఆసుపత్రులు లింక్‌ అయి ఉన్నాయి. ప్రభుత్వం నేరుగా ఆస్పత్రులకు బిల్లు చెల్లిస్తుంది. అయితే దీనికి ముందుగా ఆయుష్మాన్ భారత్ యోజనాలలో ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పథకం లబ్ధి పొందుతారు. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అన్ని చికిత్సలు అందిస్తారు. కానీ కాస్మోటిక్ సర్జరీ, డెంటల్‌, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్, ఒబెసిటీ, మానసిక సమస్యలకు మాత్రం చికిత్స అందించరు.ఈ పథకం ద్వారా ఏడాదికి ఐదు లక్షలు ఆరోగ్య బీమా అందిస్తారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 2025 నిరుపేద కుటుంబాలకు 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లు కూడా దీనికి అర్హులు. ఇది వరకు వయస్సు పెద్దగా ఉన్నవారికి ఆరోగ్య బీమా ప్రైవేటు రంగాలు అవకాశం ఇచ్చేవి కావు వీళ్ళు మాత్రమే అర్హులు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనలో భారత్ శాశ్వత నివాసితులై ఉన్నవారు మాత్రమే అర్హులు. సీనియర్ సిటిజెన్‌లు 70 ఏళ్లు పైబడిన వారు కూడా అర్హులు, వీళ్ళు కార్డు కలిగి ఉండాలి.ఆదాయం అర్బన్, రూరల్ ఏరియాలకు నిర్దేశిత ఆదాయ పరిమితిని మించి ఉండకూడదు.ఆయుష్మాన్ భారత్ యోజన కార్డు కలిగి ఉంటే ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమాను పొందుతారు. ఉచిత చికిత్సలు పొందుతారు. ఉచితంగా మెడిసిన్స్ అందిస్తారు. ఎమర్జెన్సీ ఇతర సర్వీసులు కూడా పొందుతారు. ఇవన్నీ నిరుపేద కుటుంబాలకు వర్తిస్తాయి.మీరు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పొందాలంటే అధికారిక వెబ్‌సైటులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అక్కడ మీ ఆధార్ కార్డు ఇతర వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ చేస్తే ఆధార్ కార్డు పొందుతారు