BREAKING
thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం
Date of Publish : 03 October 2026, 02:29 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మరోసారి జాప్యం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Oct, 2026 - 02:29 PM
8 వీక్షణలు

వరంగల్: మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మరోసారి జాప్యం తప్పేలా కనిపిస్తోంది. రికార్డు సమయంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి భూమిని అప్పగించినప్పటికీ, అవసరమైన అనుమతుల ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం.

ప్రధానంగా పర్యావరణ అనుమతి (Environmental Clearance-EC) రావాల్సి ఉంది. గతంలో దరఖాస్తు చేసిన కన్సల్టెన్సీ దరఖాస్తు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో జనవరిలో మరోసారి దరఖాస్తు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

జనవరిలో దరఖాస్తు చేసి మార్చిలోగా పర్యావరణ అనుమతి లభిస్తే.. 2027 ఏప్రిల్‌లో మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అనుమతుల ప్రక్రియపై ఆధారపడి నిర్మాణ పనుల ప్రారంభ సమయం మారే అవకాశం ఉంది.