BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 July 2026, 07:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గానుగపాడు–జి.కొత్తూరు ప్రధాన రహదారి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:25 PM
47 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: గానుగపాడు, జి.కొత్తూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారి దెబ్బతిని పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.

శ్రీరాంపురం–గానుగపాడు మీదుగా పేరువంచ వరకు రహదారి నిర్మాణం పూర్తయినప్పటికీ, గానుగపాడు–జి.కొత్తూరు గ్రామాల మధ్య రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేదని వారు తెలిపారు. అలాగే గానుగపాడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గానుగపాడు గ్రామంలో డబుల్ సీసీ రోడ్డు నిర్మించడంతో పాటు, గానుగపాడు–జి.కొత్తూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిని వెంటనే నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు కొత్తపల్లి వెంకట్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కోటా జమలయ్య, సీనియర్ నాయకుడు కొత్తపల్లి సత్యం, గ్రామ నాయకులు మేకల మాణిక్యరావు, కోట రాజశేఖర్, మేకల ఇనాక్‌రావు, గంజిబోయిన శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.