BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 08:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గబ్బిలాలు వాలడంతో తెగిన విద్యుత్ వైర్లు… తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 08:27 PM
136 వీక్షణలు

గబ్బిలాలు వాలడంతో తెగిన విద్యుత్ వైర్లు… తప్పిన పెను ప్రమాదం

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో బుధవారం రాత్రి అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గోపాలపురం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతం గుండా వెళ్లే విద్యుత్ లైన్లపై గబ్బిలాలు ఒక్కసారిగా వాలడంతో భారీ శబ్దంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ఘటనలో మూడు చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.

చీకటి సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న ఉప సర్పంచ్ అశోక్ వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం తెల్లవారుజామున అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహకారంతో మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.