BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 11:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 11:41 AM
68 వీక్షణలు

గంపలగూడెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం

కొత్త అర్హుల పింఛన్ల కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలంలో శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలోని గంపలగూడెం, ఊటుకూరు, నెమలి, మేడూరు, పెనుగొలను తదితర గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు. లబ్ధిదారులు తమ ఇళ్ల వద్దే పింఛన్లు అందుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1న మొత్తం 2,24,793 మంది అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

అయితే, కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులు ఇప్పటికీ మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాలతో అర్హత ఉన్నప్పటికీ తమకు పింఛన్లు మంజూరు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా తమ దరఖాస్తులు ఇంకా ఆమోదం పొందలేదని పలువురు వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన పింఛన్లు మంజూరు చేసి పంపిణీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.