ఇంజనీర్స్ డే సందర్భంగా గంట పావన్ కుమార్ కు ఘన సత్కారం
ఇంజనీర్స్ డే సందర్భంగా పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ గంటా పవన్ కుమార్‌కు ఘన సత్కారం
నల్లజర్ల: ఇంజనీర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ దూబచర్ల మరియు పార్డ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్లజర్ల మండల అభివృద్ధి కార్యాలయంలో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ గంటా పవన్ కుమార్ను ఘనంగా సత్కరించారు. ఇంజనీరింగ్ రంగంలో సేవలందిస్తున్న ఉద్యోగులను గౌరవిస్తూ వారి సేవలను గుర్తించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి నల్లజర్ల ఎంపీడీవో GVVSN విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారులు, డ్రైనేజీ, ప్రభుత్వ భవనాలు, ఇతర అభివృద్ధి పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఇంజనీర్ల కృషి అభినందనీయమని తెలిపారు.
గంటా పవన్ కుమార్కు పుష్పగుచ్ఛం, శాలువా అందించి ఘనంగా సత్కరించారు. ఇంజనీర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఇంజనీరింగ్ వృత్తి పట్ల గౌరవాన్ని చాటడంతో పాటు, ప్రజా సేవలో భాగస్వాములవుతున్న అధికారులను ప్రోత్సహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కూచిపూడి ఉదయ భాస్కర్ రావు, పార్డ్ ఇండియా జాతీయ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ దూబచర్ల సెక్రటరీ నెక్కంటి వెంకటేష్, ట్రెజరర్ మద్దుల శ్రీనివాసరావు, పార్డ్ ఇండియా నల్లజర్ల శాఖ అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ షరీఫ్ పాల్గొన్నారు.
అలాగే పార్డ్ ఇండియా గౌరవ అధ్యక్షులు చీమకుర్తి కృష్ణ ప్రసాద్, సోమిశెట్టి వెంకటరావు, క్లబ్ మెంబర్స్ జామి రాంబాబు, చిట్యాల వి.వి. సత్యనారాయణమూర్తి, ముత్తా నాగార్జున, కొర్లే పర సాయి గంగాధర్ తదితరులు, నల్లజర్ల మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇంజనీర్ల సేవలను గుర్తించి, వారిని గౌరవించడం ద్వారా మరింత బాధ్యతతో ప్రజలకు సేవలందించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని లయన్స్ క్లబ్, పార్డ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.