BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 21 March 2026, 06:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్రామాభివృద్ధి, సంక్షేమ అమలులో మండల పరిషత్ కీలకం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:39 AM
221 వీక్షణలు

గ్రామాభివృద్ధి, సంక్షేమ అమలులో మండల పరిషత్ కీలకం: మంత్రి కొలుసు పార్థసారథి

ముసునూరు, మార్చి 20: గ్రామ సీమల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమర్థ అమలులో మండల ప్రజా పరిషత్తు అధికారులు, పాలకవర్గ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గ్రామాల్లో త్రాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ముసునూరు యంపిడివో కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి మండల పరిషత్తు అధ్యక్షులు శ్రీమతి కొండా దుర్గా భవాని అధ్యక్షత వహించగా, మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 22 శాఖల అధికారులు తమ శాఖల వారీగా ప్రగతిని వివరించారు. మండలంలో రూ.41.20 కోట్లతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలులో ఉన్నట్లు యంపిడివో తెలిపారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయకపోవడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకే సంవత్సరంలో మండలానికి రూ.41.20 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేసి పలు పనులు పూర్తిచేసిందని, మరికొన్ని వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మండలంలో సుమారు 6 వేల ఎకరాల నిరుపయోగ భూమిని సాగులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే 350 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల అవసరంలో భాగంగా ఇప్పటికే 150 ట్రాన్స్‌ఫార్మర్లు 10 రోజుల్లో ఏర్పాటు చేసి, మిగిలినవాటిని కూడా త్వరలో ఏర్పాటు చేసి లో వోల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని, ముఖ్యంగా గృహనిర్మాణ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలన్నారు. ప్రజలతో సమన్వయం పెంచుకుని ప్రభుత్వ సేవలను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర ఎంతో ముఖ్యమని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, క్లిష్టమైన సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే సమస్యలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో యంపిడివో పి.ఏసుబాబు, ఈవోపీఆర్డి బి.ఏ.సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దారు జి.పి.శర్మ, జడ్పీటీసీ సభ్యులు వరికూటి ప్రతాప్, ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, గ్రామ సర్పంచులు, అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.