BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 April 2026, 09:17 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

గ్రామాల్లో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలం

తెలంగాణ
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
28 Apr, 2026 - 09:17 PM
230 వీక్షణలు

గ్రామాల్లో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలం-- దాసరి పాండు,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని గ్రామాల్లో ఉన్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేవా,కళ్ళుండి గుడ్డివాడిలా నటించడం ఎందుకు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పండు అన్నారు

మంగళవారం రోజున బొమ్మలరామారం మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేసి తాహసిల్దార్ పి.శ్రీనివాసరావుకి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యల పై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా గ్రామాలలో ఉన్న స్థానిక సమస్యలు కంటికి కనబడతలేవా అని వారు ప్రశ్నించారు రోడ్లు,డ్రైనేజీ, అంతర్గత రోడ్లు లేక ప్రజలు వాటితో పాటు వ్యక్తిగత సమస్యలైనా అన్ని రకాల పెన్షన్లు,రైతుబంధు,ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు లాంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అని అన్నారు అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామని అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్య పరిష్కారం  చేయడం లేదని అని అన్నారు బొమ్మలరామారం మండలంలో ప్రభుత్వ భూములకు సంబంధించి పెట్టుబడిదారులు ఆక్రమించుకుంటున్న, అన్యక్రాంతమవుతున్న పట్టించుకోవడంలేదని అన్నారు వెంటనే గ్రామాల్లో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని లేనిపక్షంలో  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యకల శ్రీశైలం,ముక్యర్ల పున్నమ్మ, దేశెట్టి సత్యనారాయణ,  దేవేందర్ రెడ్డి, కోట్లసువర్ణ, పండుగ మంజుల, కిష్టమ్మ, సులోచన, చందురమ్మ, కేసారం యాదయ్య, శంకరయ్య, కేసారం బిక్షపతి, లక్ష్మయ్య, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు