BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్నాం.. ఎమ్మెల్యేల గుండాగిరికి భయపడతామా? - కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 04:09 PM
316 వీక్షణలు

మంచిర్యాల: తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్నాం, ఎమ్మెల్యేల గుండా గిరికి భయపడతామా అని టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు గుండా గిరి బంద్ చేయాలని అన్నారు. ఈ గడ్డ నుంచే తెలంగాణ రక్షణ పార్టీ ఏర్పాటయిందని, ఇక్కడ నుంచే జెండా ఎగుర వేస్తామని కవిత పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి కారణంగానే సింగరేణి సంస్థ నష్టపోతుందని ఆరోపించారు. సింగరేణి హక్కులను కాపాడేది హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ మాత్రమే అన్నారు. జిఎం చేసే పనులకు, సీఎం క్లర్క్ చేసే పనులకు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారన్నారు


​కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాటికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాంత భూమి పుత్రుడైతే సింగరేణికి మేలు చేయాలని సవాల్ చేశారు. మంచిర్యాల నుంచి 'బొగ్గు భాయ్ యాత్ర' ప్రారంభించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీగా ప్రజల కోసం 'రక్షణ సేన'ను ప్రారంభించామని వెల్లడించారు. ఇదే క్రమంలో సింగరేణి యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. అక్కడ చాలామంది కార్మికులను తగ్గించే కుట్ర జరుగుతోందని, కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. కార్మికులకు మరియు సింగరేణికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రపూరిత ప్రయత్నాలన్నీ తెలంగాణ డిప్యూటీ సీఎం కనుసన్నల్లోనే జరుగుతున్నాయని వారు సంచలన ఆరోపణలు చేశారు​తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గుజరాత్ మినరల్స్ తరహాలో తెలంగాణలోనూ ప్రత్యేకంగా మైనింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఈ విధానం ద్వారా సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైనింగ్ కూడా సులభంగా చేసుకోవచ్చని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గతంలో బొగ్గు కుంభకోణాన్ని సాకుగా చూపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏకంగా 250 బొగ్గు బ్లాకులను జాతీయం చేసిందని విమర్శించిన ఆమె, తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం కేవలం కల మాత్రమేనని, కేంద్రం తెస్తున్న నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ కార్మికులకు ఎలాంటి న్యాయం చేయలేకపోయారని, కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగేలా పెద్దపల్లి ఎంపీ చొరవ చూపాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో సింగరేణిలో మంచిర్యాల ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిని త్వరలోనే ఆధారాలతో బయటపెడతామని హెచ్చరించిన కవిత, తాళ్లపల్లిలో సింగరేణి కోసం తమ విలువైన భూములిచ్చిన నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు