BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

లైన్‌మెన్ నిర్లక్ష్యానికి యువకుడికి తీవ్ర గాయాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Jun, 2026 - 03:49 PM
761 వీక్షణలు

న్యాయం చేయాలంటూ చిట్యాల సబ్ స్టేషన్ ఎదుట ధర్నా

కరెంట్ పనుల నిమిత్తం తీసుకెళ్లిన లైన్‌మెన్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగి 18  రోజులు గడుస్తున్నా అటు లైన్‌మెన్ గానీ, ఇటు విద్యుత్ శాఖ అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో బాధితుడి కుటుంబం రోడ్డున పడింది. సోమవారం రోజు చిట్యాల లోని సబ్ స్టేషన్ లో పట్టిమర్తి గ్రామస్తులు విద్యుత్ సరఫరా నిలిపివేసి  ధర్నాకు దిగారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బావితురాలైన  తల్లి తెలిపిన వివరాల ప్రకారం. ​నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి  గ్రామానికి చెందిన తన కొడుకు  మనోజ్  మే 30, 2026 నాడు స్థానిక సబ్‌స్టేషన్ పరిధిలో పని చేసే లైన్‌మెన్  వెంకటేష్  కరెంట్ పని కోసం పిలుచుకెళ్లాడు. ​పని చేసే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా, కరెంట్ లైన్ 11 కె.వి  పోల్‌పైకి మనోజ్ ను ఎక్కించారు. లైన్‌మెన్ నిర్లక్ష్యం కారణంగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో (ఇండక్షన్ రావడం వల్ల) మనోజ్ కు తీవ్రంగా కరెంట్ షాక్ కొట్టి పైనుంచి కిందపడిపోయాడు అని తెలిపారు  ​ఈ ప్రమాదంలో మనోజ్ కు రెండు కాళ్లు, చేతులు, వీపు భాగం తీవ్రంగా గాయాలు తాకి విరిగిపోయాయి. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు అన్నారు. భర్త లేని ఆ కుటుంబానికి కొడుకే (మనోజ్) ఆధారం కాగా, ఇప్పుడు కొడుకు కూడా వికలాంగుడిగా మారడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ​ప్రమాదం జరిగిన సమయంలో లైన్‌మెన్ వెంకటేష్ బాధితుడి కుటుంబంతో మాట్లాడి, తానే చూసుకుంటానని నమ్మబలికాడు. కానీ ఆసుపత్రి లో 17 రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ లైన్‌మెన్ గానీ, ఇటు విద్యుత్ శాఖ డిపార్ట్‌మెంట్ వారు గానీ కనీసం పట్టించుకోలేదు సరే కదా, కనీస సహాయం కూడా చేయలేదని బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
​దీనిపై బాధితుడి తల్లి జాల బద్రమ్మ తమకు జరిగిన అన్యాయాన్ని   ప్రమాదానికి కారణమైన లైన్‌మెన్‌పై చర్యలు తీసుకుని, విద్యుత్ శాఖ నుండి తమ కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటున్నారు.