BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 07 July 2026, 06:32 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది--ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / తుర్కపల్లి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
07 Jul, 2026 - 06:32 AM
124 వీక్షణలు

నిర్మాణంలో ఉన్న ఇళ్లను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసలమర్రి గ్రామంలో సోమవారం రోజున ఉదయం ప్రభుత్వం విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సంబంధిత అధికారుల తో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు. ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లకు సంబంధించిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని, లబ్ధిదారులతో సమన్వయం చేసుకుని వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి, పనుల్లో జాప్యానికి తావు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.గ్రామంలో చివరి దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణాన్ని పరిశీలించి, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.అలాగే గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఎక్కడా లోటు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.