BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 07 July 2026, 06:33 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

అంబేద్కర్ భవనాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడే విధంగా అన్ని వసతులు కల్పించాలి --జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
07 Jul, 2026 - 06:33 AM
80 వీక్షణలు

అంబేద్కర్ భవనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు సోమవారం రోజున భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్... భవనం నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఇప్పటి వరకు పూర్తయిన నిర్మాణ పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అంబేద్కర్ భవనానికి అవసరమైన మౌలిక వసతులపై కూడా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.భవనం ముందు సీసీ రోడ్డు నిర్మాణం, గ్రీనరీ అభివృద్ధి, పరిసరాల సుందరీకరణ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భవనాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడే విధంగా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు,ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.