BREAKING
నాడు గరీబులు – నేడు కుబేరులు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. నాడు గరీబులు – నేడు కుబేరులు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా.
www.ntodaynews.com

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం--ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
19 Jun, 2026 - 09:36 AM
67 వీక్షణలు

ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి పలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని ఫకీర్ గూడెం గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండల తహసిల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం చికటి మామిడి గ్రామంలో హెచ్‌ఎండీఏ (HMDA) నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మరియు సోలిపేట గ్రామంలో నూతన జెండా కార్యక్రమం ఆవిష్కరణ, నూతన వాటర్ ప్లాంట్  ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, విద్యా మరియు వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు.చికటి మామిడి గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చీర సత్యనారాయణ,భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేష్ పైలెట్ , మండల తహసిల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో శ్యామల,విద్యుత్ శాఖ ఏఈ సందీప్ , స్థానిక ఎస్సై బుగ్గ శ్రీశైలం,రెవిన్యూ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది,మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యంజాల కళ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు దాసరి సూర్యప్రకాశ్ రెడ్డి, మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మైలారం సుదర్శన్, మహిళా కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షురాలు ఫకీర్ సంగీత, శ్రీరాముల నాయక్, రామిడి రామిరెడ్డి, భోగ కల్పన వెంకటేష్, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, అధికారులు, మహిళలు, యువకులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.