BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 18 June 2026, 03:45 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు

ఆంధ్రప్రదేశ్
18 Jun, 2026 - 03:45 PM
112 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సముద్రం అలజడిగా ఉండే అవకాశముండటంతో ఉత్తర కోస్తా తీర ప్రాంత మత్స్యకారులు వచ్చే ఐదు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. గాలుల వేగం పెరిగే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో విజయనగరం జిల్లాలోని వేపాడ ప్రాంతంలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రజలు తాజా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అధికారుల సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Live Weather Check:

mausam.imd.gov.in