BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 18 June 2026, 04:39 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
18 Jun, 2026 - 04:39 PM
55 వీక్షణలు

అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనధికారికంగా ప్రోటోకాల్ సైరన్ ఉపయోగించిన ఓ కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. AP 40 HT 0055 నంబర్ గల కారు పోలీస్ సైరన్ శబ్దంతో పట్టణంలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.

ఈ విషయాన్ని అమలాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ Veerababu వెల్లడించారు. సదరు వాహనంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన పోలీస్ సైరన్‌ను తొలగించి, వాహన యజమానిపై జరిమానా విధించినట్లు తెలిపారు.

ప్రత్యేక హోదా కలిగిన అధికారులు, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే సైరన్ వినియోగానికి అనుమతి ఉంటుందని, సాధారణ వాహనాల్లో అనధికారికంగా సైరన్లు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సీఐ వీరబాబు సూచించారు.