BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 18 June 2026, 09:09 pm
Posted by : V శ్రీనివాస్

​ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల సమావేశం

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 09:09 PM
163 వీక్షణలు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల విజయవంతమైన పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ముకేశ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో విశ్వకర్మ మరియు ముద్ర లోన్ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునాథ్ వెరబెల్లి గారు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ గారితో కలిసి పాల్గొని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా వివరించారు.

​ముఖ్యంగా విశ్వకర్మ, ముద్ర లోన్ తదితర పథకాల ద్వారా స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారత మరియు సామాజిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వారు లబ్ధిదారులకు వివరించారు.

​ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుండగా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని వారు పేర్కొన్నారు. ఈ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత స్థిరపడాలని నాయకులు పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు