BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 18 June 2026, 08:27 pm
Posted by : V శ్రీనివాస్

​ఎల్.పి.జి. వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 08:27 PM
285 వీక్షణలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం కింద వంటగ్యాస్ రాయితీని నిరంతరంగా పొందేందుకు వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలను వెంటనే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఒక ప్రకటనలో కోరారు. చమురు మార్కెటింగ్ సంస్థలతో బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియ జిల్లాలో చురుగ్గా కొనసాగుతోందని, ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు ఈ నెల 30వ తేదీ లోపు తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

​నిర్ణీత గడువు ముగిసేలోగా ఆధార్‌తో బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయని వినియోగదారులకు వంటగ్యాస్ రాయితీ జమ కావడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అదనపు కలెక్టర్ తెలిపారు. అయితే, రాయితీ జమలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆధార్ అనుసంధానంతో సంబంధం లేకుండా వంటగ్యాస్ సరఫరా సేవలు మాత్రం యథావిధిగానే కొనసాగుతాయని వినియోగదారులు గమనించాలని ఆయన వివరించారు.

​రేషన్ కార్డుదారులు ఈ - కె వై సి పూర్తి చేయాలి

​ఇదే క్రమంలో జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలనే ఉద్దేశ్యంతో, నకిలీ కార్డులను నిరోధించి రికార్డులను నవీకరించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ-కేవైసీ చేయించుకోని వారు, రేషన్ కార్డులోని సభ్యులందరూ వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి, అక్కడి యంత్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు