BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 18 June 2026, 12:35 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
18 Jun, 2026 - 12:35 PM
114 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సు ప్రసవం నిర్వహించగా, అనంతరం తల్లి, నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుండాల మండలం శంభూనిగూడెం గ్రామానికి చెందిన వనజ (20)కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని, దీంతో నర్సు సాధారణ ప్రసవం నిర్వహించినట్లు సమాచారం.

ప్రసవం అనంతరం నవజాత శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.

ఇదే సమయంలో ప్రసవం అనంతరం వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది.

ఈ ఘటనకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు విధుల్లో అందుబాటులో లేకపోవడం వల్లే తమ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుందని ఆరోపించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.