BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 18 June 2026, 09:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహిళగా రూపాంతరం చెంది మోసాలకు పాల్పడిన వ్యక్తి బాగోతం వెలుగులోకి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 09:13 PM
188 వీక్షణలు

అన్నమయ్య జిల్లా మదనపల్లి శివాజీనగర్‌కు చెందిన మోహన కృష్ణ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి, తర్వాత మహిళగా రూపాంతరం చెంది మళ్లీ స్వస్థలానికి తిరిగి వచ్చిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తర్వాత మధు శ్రీ అనే పేరుతో గుర్తింపు పొందిన అతను చీరకట్టుతో ప్రజల మధ్య తిరుగుతూ, వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల పేరుతో కొందరిని, అలాగే పూజలు, గుప్త నిధులు, దుష్టశక్తుల నివారణ వంటి నమ్మకాల ఆధారంగా మరికొందరిని మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

“ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయి, వాటిని తొలగిస్తాను” అంటూ కొంతమందిని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా ఈ వలలో చిక్కుకున్నారని సమాచారం.

అంతేకాకుండా ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని వివాహ వేడుకలకు వెళ్లడం, జంటలపై దిష్టి తీయడం వంటి పేర్లతో డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తన వెనుక పోలీసు, రాజకీయ అండ ఉందని చెబుతూ బెదిరింపులు చేసినట్లు కూడా బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కొన్ని కుటుంబాలు మీడియా ముందుకు రావడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.

దాదాపు 13 కుటుంబాలు ప్రభావితమయ్యాయని, కోట్ల రూపాయల మేర మోసపోయామని ఓ బాధితురాలు ఆరోపించినట్లు సమాచారం.