BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 11:51 am
Posted by : గంగుల రాజ్ కుమార్

గుల్లకోటలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ భూమిపూజ మహోత్సవం

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
19 Aug, 2026 - 11:51 AM
236 వీక్షణలు

గుల్లకోటలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ భూమిపూజ మహోత్సవం

మంచిర్యాల నియోజకవర్గం: లక్షెట్టిపేట్ మండలంలోని గుల్లకోట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం ఎంతో పవిత్రమైన కార్యక్రమమని అన్నారు. ఆలయ నిర్మాణ పనులకు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

ముందుగా గుల్లకోట గ్రామస్తులు సురేఖమ్మకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో సురేఖమ్మ గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, సర్పంచులు బానేష్, భాను, జిల్లా నాయకులు పూర్ణచందర్ రావు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.