BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 13 May 2026, 08:40 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

కుప్పలుగా రాసులు, అయోమయంలో రైతులు, పట్టించుకోని అధికారులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
13 May, 2026 - 08:40 AM
296 వీక్షణలు

కుప్పలుగా రాసులు, అయోమయంలో రైతులు, పట్టించుకోని అధికారులు

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం,నాగినేనిపల్లి రైతులు సయ్యద్ మౌలానా పాషా ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం అమ్ముకునేందుకు గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్ని సంచులు లేకపోవడం,కాంట అయిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు అందుబాటులో లేక రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు కళ్లల్లో కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. తరుగుపేరు చెప్పి బస్తాకు పది కిలోల వరకు కటింగ్ చేయడం రైతులపై జరుగుతున్న బహిరంగ దోపిడీ అని ఆయన మండిపడ్డారు. ఏ గ్రేడ్ గాఉన్న ధాన్యాన్ని బి గ్రేడ్ గా మార్చి రైతులను మోసం చేస్తున్న మిల్లర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు, మండలంలోని కొనుగోలు కేంద్రాలలో వెంటనే  అవసరమైన గన్ని సంచులు, లారీలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.