BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 July 2026, 02:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గురు పౌర్ణమి వేళ తిరువూరు సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 02:52 PM
34 వీక్షణలు

తిరువూరు, జూలై 29: గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఘనంగా ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే సాయిబాబా వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, అర్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తిరువూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని సాయిబాబా ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఎమ్మెల్యేతో కలిసి సాయిబాబా ఆశీస్సులు పొందారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.