BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 06:47 pm
Posted by : కూనురు మధు

గురుకులాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్ చంద్రశేఖర్

తెలంగాణ
/ నల్గొండ / దేవరకొండ
19 Aug, 2026 - 06:47 PM
53 వీక్షణలు

గురుకులాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్ చంద్రశేఖర్ 


రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం గుండ్లపల్లి (డిండి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, డార్మిటరీ, కిచెన్, స్టోర్ రూమ్, వాష్‌రూమ్‌లను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తొలగించాలని పంచాయతీ కార్యదర్శి జంగయ్యను ఆదేశించారు. వాష్‌రూమ్‌లను నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వెంటనే తలుపులు ఏర్పాటు చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

పాఠశాలలో సివిల్ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల రూ.26 లక్షలు మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ నిధులతో డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్, భవన మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని డీఈ శైలజను ఆదేశించారు.

అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్ స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. సరుకుల వివరాలను స్టాక్ రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, కాలం చెల్లిన సరుకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని స్పష్టం చేశారు. నెలకు అవసరమైన పరిమాణంలోనే సరుకులు తెప్పించుకోవాలని, విద్యార్థులకు తాజా కూరగాయలను అందించాలని ప్రిన్సిపల్ శిరీష, స్టోర్ కీపర్లకు సూచించారు.

వంట సరుకులను వృథా చేయకుండా రోజువారీ అవసరాలకు అనుగుణంగా మాత్రమే వినియోగించాలని తెలిపారు. వంట సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు, తలకు కవర్లు ధరించాలని ఆదేశించారు. విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆత్మరక్షణలో భాగంగా వారికి కరాటే శిక్షణ ఇప్పించాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.

అనంతరం విద్యార్థినులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. వారి చదువు, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో వైజన, సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.