BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 04 June 2026, 09:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘోరం.. 700 తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 09:09 PM
145 వీక్షణలు

ఘోరం.. 700 తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత!

ఫారో దీవుల్లో వార్షిక వేటపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం

ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని Faroe Islandsలో నిర్వహించే సంప్రదాయ గ్రైండాడ్రాప్ వేట మరోసారి వివాదాస్పదమైంది. ఈ సంప్రదాయంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 700 తిమింగలాలు, డాల్ఫిన్లు వేటకు గురైనట్లు సమాచారం.

వేట సందర్భంగా వందలాది సముద్ర జీవులను ఒకేసారి చంపడంతో దీవి తీర ప్రాంత సముద్ర జలాలు రక్తంతో ఎర్రగా మారుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా జంతు సంరక్షణ సంస్థలు, జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శతాబ్దాల నాటి సంప్రదాయమని స్థానికులు సమర్థించుకుంటున్నప్పటికీ, ఆధునిక కాలంలో ఇలాంటి వేటలను నిలిపివేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. సముద్ర జీవుల సంరక్షణ కోసం ఈ ఆచారానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిస్తున్నారు.