BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 27 February 2026, 07:29 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రభుత్వాలు వెంటనే ‘బీసీ యాక్ట్’ ఏర్పాటు చేయాలి

తెలంగాణ
27 Feb, 2026 - 07:29 AM
310 వీక్షణలు
కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ‘బీసీ యాక్ట్’ ఏర్పాటు చేయాలి NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ మంచిర్యాల, 26-02-2026: బీసీల సామాజిక రక్షణ, భద్రత కోసం ప్రత్యేకంగా ‘బీసీ యాక్ట్’ తీసుకురావాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. దేశం మరియు రాష్ట్రంలో బీసీల డిమాండ్లపై దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గానీ, రాష్ట్రంలో గతం మరియు ప్రస్తుత ప్రభుత్వాలు గానీ స్పష్టమైన చర్యలు తీసుకోలేదని సంస్థ ప్రతినిధులు విమర్శించారు. మంచిర్యాలలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు శాఖపురి భీంసేన్, చంద్రమౌళి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ప్రకటన చేయడం స్వాగతించదగినదని తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీల రక్షణకు చట్టపరమైన భరోసా అవసరమని పేర్కొన్నారు. గతంలో వరంగల్‌లో యాదవ యువతిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడి ఘటనలను ప్రస్తావిస్తూ బీసీ వర్గాలకు తగిన రక్షణ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు బీసీల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే ‘బీసీ యాక్ట్’ను అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. #Mancherial #BCAct #BCRights #SocialJustice #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube