BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 July 2026, 01:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం.. నాగోల్ మూసీ వద్ద నేలపై పడిన త్రివర్ణ పతాకం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 01:24 PM
71 వీక్షణలు

హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం.. నాగోల్ మూసీ వద్ద నేలపై పడిన త్రివర్ణ పతాకం

హైదరాబాద్‌లోని నాగోల్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాంతంలో జాతీయ జెండా నేలపై పడిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా జెండా స్తంభానికి అమర్చిన ఇనుప గొలుసులు (రోపులు) తెగిపోవడంతో త్రివర్ణ పతాకం చిరిగి నేలపై పడింది.

ఈ ఘటన జరిగినప్పటికీ మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటివరకు మరమ్మత్తులు చేపట్టకపోవడం, జెండాను తిరిగి ఎగురవేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ జెండా గౌరవాన్ని కాపాడడంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన స్థానికులు, ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, జెండాను తక్షణమే గౌరవప్రదంగా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.