BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 07 September 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో ఉల్లి ధరలకు రెక్కలు.. కిలో రూ.80 దాటిన ధర!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Sep, 2026 - 06:43 PM
8 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు మరోసారి సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.30 నుంచి రూ.50 వరకు ఉన్న ఉల్లి ధరలు ప్రస్తుతం ఏకంగా రూ.70–80కి చేరాయి. తెల్ల ఉల్లి ధర అయితే కిలో రూ.100 దాటడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్‌లోని మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి రూ.4,500 నుంచి రూ.5,200 వరకు పలుకుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే ధరలు భారీగా పెరగడంతో రిటైల్ మార్కెట్‌లో మరింత భారం పడుతోంది.

దిగుబడి తగ్గడంతోనే ధరల పెరుగుదల

మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఉల్లి దిగుబడి తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడం, పంట దిగుబడిపై ప్రభావం చూపినట్లు పేర్కొంటున్నారు.

మరోవైపు రవాణా ఖర్చులు, మార్కెట్‌లో సరఫరా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు తోడవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థానికంగా కొత్త ఉల్లి పంట మార్కెట్‌కు వచ్చే వరకు ధరలు పెద్దగా తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఉల్లి ధరలు ఇలా పెరగడంతో వంటింటి బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉల్లి ధరల పెరుగుదల మరింత భారంగా మారింది.