BREAKING
thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు
Date of Publish : 23 September 2026, 07:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష ముప్పు..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 07:09 AM
4 వీక్షణలు

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష ముప్పు.. పలు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 9 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు వరద ముప్పు ఉన్నట్లు హెచ్చరికలు వెల్లడయ్యాయి. ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, కాలువల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

తెలంగాణలోనూ 4 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు ఆకస్మిక వరదల హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రంలోగా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు సమాచారం. పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ హెచ్చరికలు వెల్లడయ్యాయి.

అలాగే పొరుగు రాష్ట్రాలైన ఒడిశాలో 5 జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌లో 3 జిల్లాలకు కూడా ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌లు జారీ అయినట్లు సమాచారం. భారీ వర్షాల నేపథ్యంలో నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.