టిడిపి పుంగనూరు నియోజకవర్గ నూతన ఇంచార్జి మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో ప్రజా దర్భార్...
అన్నమయ్య జిల్లా, పుంగనూరు:
పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నూతన ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి స్పందన లభించింది. వివిధ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహించిన కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజా దర్బార్‌లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి మధుసూదన్ నాయుడు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ప్రజలు భూ వివాదాలు, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యలు, గృహ నిర్మాణాలు, కొత్త పింఛన్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు తదితర అంశాలపై ఫిర్యాదులు అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫిర్యాదులను స్వీకరించిన మధుసూదన్ నాయుడు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజా ప్రతినిధులు, నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు.
పుంగనూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో కార్యక్రమం సందడిగా సాగింది. వివిధ సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదులు అందజేసే అవకాశం లభించడంతో కార్యక్రమానికి స్పందన లభించింది.