అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో అక్టోబర్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వైజాగ్ వెదర్‌మ్యాన్ అంచనా వేసినట్లు సమాచారం. ఏపీలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ అధికారిక హెచ్చరికలను గమనించాలని సూచిస్తున్నారు.