ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా
ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా
అవినీతికి తావులేకుండా పెన్షన్ల పంపిణీ – ఎన్డీఏ ప్రభుత్వ ప్రత్యేకత
ధి: 01-06-2026: సోమవారం ఉదయం 1వ డివిజన్ గుణదల వంతెన సమీపంలోని కృష్ణ హోటల్ కట్ట ప్రాంతం మరియు 64వ డివిజన్ కండ్రిక సాయిబాబా గుడి పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు, పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటి వద్దకే అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి పెన్షన్ అందించడం వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా ప్రయోజనం పొందుతున్నామని హర్షం వ్యక్తం చేశారు.
పెన్షన్ పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. ప్రజలు వినిపించిన సమస్యలను ఓర్పుగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో పేద, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ₹3,000గా ఉన్న సామాజిక పెన్షన్‌ను ఎన్నికల హామీ మేరకు ₹4,000కు పెంచి దేశంలోనే అత్యధిక పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు.
అలాగే దివ్యాంగులకు ₹6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన బెడ్‌రిడెన్ బాధితులకు ₹10,000, థలసేమియా వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ₹15,000 పెన్షన్ అందిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నేరుగా లబ్ధిదారుల గడప వద్దకు చేరేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
గత 24 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.70 వేల కోట్లకు పైగా వ్యయం చేసి సామాజిక భద్రత కల్పించామని తెలిపారు. ఒక్క రూపాయి కూడా అవినీతికి గురికాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు చేరేలా పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
పేదల కష్టాలను అర్థం చేసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. వృద్ధాప్యంలో ఆధారంగా, దివ్యాంగులకు ధైర్యంగా, వితంతువులకు అండగా ఈ పెన్షన్ పథకం నిలుస్తోందని పేర్కొన్నారు.
“సంక్షేమం అంటే కేవలం పథకాలు ప్రకటించడం కాదు... అవి నిజంగా అర్హులైన ప్రజలకు చేరేలా చూడటం. అదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పేద ప్రజలకు అండగా, భరోసాగా ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది” అని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం లో :- టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి ఉదయశ్రీ, పార్లమెంట్ అధికార ప్రతినిధి వింజమూరి సతీష్, పార్లమెంట్ అధికార ప్రతినిధి పలగాని భాగ్యలక్ష్మి, 1వ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని సురేష్, 64వ డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, రితీష్ కుమార్, పరుచూరి భార్గవ్, దివ్య, సత్య, తెళ్ల భవాని, తదితరులు పాల్గొన్నారు...