BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 15 September 2026, 09:32 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మేడిగడ్డ వద్ద గోదావరి నదికి పెరిగిన వరద ప్రవాహం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
15 Sep, 2026 - 09:32 PM
13 వీక్షణలు

94,640 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. అంతే మొత్తంలో దిగువకు నీటి విడుదల

మేడిగడ్డ | Ntoday News

మేడిగడ్డ వద్ద గోదావరి నదికి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బ్యారేజీ నీటిమట్టం 90.30 మీటర్లుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి 94,640 క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీకి చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు సమాచారం.

గత రెండు రోజులుగా సుమారు 35,890 క్యూసెక్కులుగా ఉన్న వరద ప్రవాహం, మంగళవారం ఒక్కసారిగా దాదాపు 60 వేల క్యూసెక్కులకు పెరిగింది. అనంతరం ప్రవాహం మరింత పెరిగి 94,640 క్యూసెక్కులకు చేరినట్లు తాజా సమాచారం.

మేడిగడ్డ బ్యారేజీ తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం పరిధిలో గోదావరి నదిపై ఉంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలక బ్యారేజీలలో ఒకటి. 

వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహంలో మార్పులను బట్టి దిగువకు నీటి విడుదలలోనూ మార్పులు ఉండే అవకాశం ఉంది.